News

మోదీకి భయపడాల్సిన అవసరం ఆయనకు లేదు


కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విభజన తర్వాత ఆదాయం తగ్గిపోతుందని ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగానని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై అవగాహన కల్పిచేందుకు శుక్రవారం కాకినాడలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి హోదాపై కాంగ్రెస్‌ అప్పుడు చట్టంలో చేర్చకుండా ఇప్పుడు తమపై విమర్శలు చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు కేసులకు భయపడుతున్నారని ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రధాని మోదీకి భయపడాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.